అన్ని వర్గాలకు అండగా కాంగ్రెస్ సర్కార్ : చింతకుంట విజయ రమణారావు

అన్ని వర్గాలకు అండగా కాంగ్రెస్ సర్కార్ : చింతకుంట విజయ రమణారావు
  •     ఎమ్మెల్యే విజయ రమణారావు
  •     గడ్డం వంశీ కృష్ణకు మద్దతుగా ఊపందుకున్న ప్రచారం

సుల్తానాబాద్, వెలుగు:  రైతులకు, మహిళలకు , అన్ని వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ను గెలిపించాలని కోరుతూ ఆదివారం సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రి నగర్ లో ఇంటింటికీ తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే ఐదు గ్యారంటీలను అమలు చేశామని  మహిళలకు పెద్దపీట వేశామన్నారు.  ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం, కరెంటు జీరో బిల్లు, రూ. 500 కే గ్యాస్ సిలిండర్, ఆరోగ్య శ్రీ పరిమితిని రూ. 10 లక్షల పెంపు చేయడం జరిగిందన్నారు. ఆగస్టు 15 లోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయడం జరుగుతుందన్నారు.  

ప్రస్తుతం ఎలాంటి వడ్ల కటింగ్ లేకుండా రైతులకు మేలు చేస్తున్నట్టు చెప్పారు. లారీల ద్వారా ఇసుక రవాణాను తానే స్వయంగా అధికారులకు సమాచారం ఇచ్చి అడ్డుకోవడం జరుగుతుందని తెలిపారు. మచ్చలేని, విజన్ ఉన్న గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని  ఆయన కోరారు.  కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ లీడర్లు మినుపాల ప్రకాశ్ రావు, సాయిరి పద్మ, మహేందర్, అంతటి అన్నయ్య గౌడ్, గాజుల రాజమల్లు, దామోదర్ రావు, అబ్బయ్య గౌడ్, బిరుదు కృష్ణ, పన్నాల రాములు, రాజలింగం, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
 
కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు

బీఆర్ఎస్ పార్టీకి సుల్తానాబాద్ మండలంలో రాజీనామాలు మొదలయ్యాయి.  మాజీ సర్పంచులు పన్నాల స్వరూప తిరుపతి (కందునూరిపల్లె), ఏరుకొండ రమేశ్ (చిన్నకల్వల) లతోపాటు 50 మంది నాయకులు, కార్యకర్తలు, నారాయణ రావు పల్లి గ్రామం నుంచి రిటైర్డ్ ఎక్సైజ్ సీఐ నారాయణ గౌడ్, చిన్న బొంకూర్ గ్రామ సీనియర్ నాయకుడు డాక్టర్ చారి తో పాటు పలువురు కార్యకర్తలు విజయ రమణారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ చేరారు.