సుల్తానాబాద్, వెలుగు: గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మండలంలో మినీ స్టేడియం నిర్మించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. సీఎం కప్ టార్చ్ రిలే స్పోర్ట్స్ ర్యాలీని సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రి నగర్ లో సోమవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారని చెప్పారు. ర్యాలీలో ఎమ్మెల్యేతోపాటు అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్, మున్సిపల్ చైర్‌పర్సన్ గాజుల లక్ష్మి, వైస్ చైర్‌పర్సన్ సమత, స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు రవీందర్, డీవైఎస్‌వో సురేశ్, లీడర్లు ప్రకాశ్‌రావు, అన్నయ్య గౌడ్, మహేందర్, అబ్బయ్య గౌడ్, సతీశ్, కిశోర్, తిరుపతి, సీఐ సుబ్బారెడ్డి, ఎస్సై శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు.