- ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు
సుల్తానాబాద్, వెలుగు: రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల గ్రామంలో పీఎసీఎస్ వడ్ల కొనుగోలు సెంటర్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులకు రుణమాఫీ, సన్నవడ్లకు రూ.500 బోనస్, వడ్ల కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నట్టు వివరించారు.
10 సంవత్సరాల పాటు రైతులకు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టని బీఆర్ఎస్ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పై బురద చల్లడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మినుపాల ప్రకాశ్ రావు, సింగిల్ విండో చైర్మన్ దేవరనేని మోహన్ రావు, సీఈఓ వి. రమేశ్, కాంగ్రెస్ లీడర్లు చిలుక సతీశ్, పన్నాల రాములు, పోచాలు తదితరులు పాల్గొన్నారు.