పెద్దపల్లి/సుల్తానాబాద్, వెలుగు: పెద్దపల్లి మండలం కాపులపల్లి, సుల్తానాబాద్ మండలం తొగర్రాయి, ఎలిగేడు మండల కేంద్రంలో ఎల్లమ్మ, బీరన్న పట్నాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాల ప్రజలు తమ ఆరాధ్య దైవాలను కొలిచేందుకు బోనాలతో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకల్లో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఎమ్మెల్యేను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఆయన వెంట పార్టీ లీడర్లు మినుపాల ప్రకాశ్‌రావు, చిలుక సతీశ్, సాయిరి మహేందర్, గడ్డం అనిల్, మురళి, ఎడెల్లి శంకర్, రాజేందర్, తిరుపతి, వెంకటేశ్వర్ రావు, శ్రీనివాస్, సత్యనారాయణ పాల్గొన్నారు.