పెద్దపల్లి, వెలుగు : ప్రతీ పంటకు మద్దతు ధర కల్పిస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. కాంగ్రెస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా మంగళవారం పెద్దపల్లి మండలం కనగర్తి, కాపులపల్లి, రాగినేడు, కుర్మపల్లి, బ్రాహ్మణపల్లి, బొంపల్లి, మేరపల్లి గ్రామాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని ఉపాధి హామీ కూలీలను, గ్రామస్తులను కోరారు.