
పెద్దపల్లి/సుల్తానాబాద్, వెలుగు: రైతు సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ఎలిగేడు మండలం ధూళికట్ట, ముప్పిరితోట, రాములపల్లి, ర్యాకేల్‌దేవ్ పల్లి, ఎలిగేడు గ్రామాలలో ఐకేపీ, ప్యాక్స్ ఆధ్వర్యంలో ఆదివారం వడ్ల కొనుగోలు సెంటర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వ్యవసాయ రంగానికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయన్నారు.
అనంతరం సుల్తానాబాద్ మండలం కనుకుల, రామునిపల్లె, రేగడి మద్దికుంట, అల్లీపూర్ గ్రామాల్లో సింగిల్ విండో, ఐకేపీల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వడ్ల కొనుగోలు సెంటర్లను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, ఎలాంటి కటింగ్‌లు లేకుండా వడ్ల కొనుగోలుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వడ్ల సెంటర్లలో ఎలాంటి అవినీతి జరగకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. ఆయా కార్యక్రమాల్లో లైబ్రరీ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్, ఏఎంసీ చైర్మన్ మినుపాల ప్రకాశ్‌రావు, సింగిల్ విండో చైర్మన్లు వేణుగోపాల్‌రావు, కోట వీణ, గడ్డం మహిపాల్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.