పెద్దపల్లి, వెలుగు : కుటుంబ గణనతో సమాజంలో సమానత్వం ఏర్పడుతుందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సర్వేపై విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పెద్దపల్లి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్‌తో కలిసి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడారు. రాష్ట్రంలో నవంబర్ 6 నుంచి సామాజిక, ఆర్థిక, కుల గణన సర్వే జరుగనుందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ కుల సంఘాలు,స్వచ్చంద సంఘాల ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.