- పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు
పెద్దపల్లి, వెలుగు : ఉద్యమకారులతోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో గత పాలకులు ఉద్యమకారులను పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమకారులకు తగిన గౌరవం ఉంటుందన్నారు.
ఆరు గ్యారంటీల్లో ఉద్యమకారులకు పెద్దపీట వేసిందన్నారు. ఈ సందర్భంగా ఉద్యమకారులు ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యక్రమంలో ఉద్యమకారులు సీమ శ్రీనివాస్, గుండేటి ఐలయ్య యాదవ్, శంకర్, రాజేశం, నారాయణ రెడ్డి, కృష్ణ, ఆంజనేయరావు, రాజయ్య, సురేందర్, మశ్రత్, ధనుంజయ్, చంద్రకళ పాల్గొన్నారు.