పెద్దపల్లి: పెద్దపెల్లి ఎంపీ అభ్యర్థిగా వంశీ గెలిచి పార్లమెంట్లో కూర్చోవడం ఖాయమని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. వంశీ ఆధ్వర్యంలో పెద్దపెల్లిలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందన్నారు. అందరి సమన్వయంతో మంచి మెజార్టీ తీసుకొస్తామన్నారు.
గతంలో కాకా చేసిన అభివృద్ధే వంశీని గెలిపిస్తుందన్నారు. యువకుడు, విద్యావంతుడైన వంశీని గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. వంశీ గెలిస్తే యువతకు భవిష్యత్ ఉంటుందన్నారు. పెద్దపల్లిలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు వంశీ కృషి చేస్తారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు బీఆర్ఎస్ చేసిందేమీ లేదన్నారు.