పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ నామినేషన్ వేశారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి పెద్దపల్లి కలెక్టరేట్ లో మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశారు.
అంతకుముందు మంచిర్యాల లోని శ్రీ లక్ష్మీ గణపతి ఓంకారేశ్వర స్వామి, పంచముఖ హనుమాన్ ఆలయంలో గడ్డం వంశీకృష్ణ ప్రత్యేక పూజలు చేశారు. మొదటి సారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న సందర్భంగా దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు. ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువాతో సత్కరించి ఆశీర్వదించారు. అనంతరం సొంతగా డ్రైవింగ్ చేస్తూ కలెక్టరేట్ లోని రిటర్నింగ్ అధికారి ఆఫీస్ కి వెళ్లారు వంశీ కృష్ణ.
పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీకృష్ణ పోటీచేస్తుండగా..బీజేపీ నుంచి గోమాస శ్రీనివాస్, బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్ పోటీచేస్తున్నారు.