- పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
గోదావరిఖని, వెలుగు : యాదవుల అభివృద్ధికి ఎల్లప్పుడు తన మద్దతు ఉంటుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో ఆదివారం రాత్రి శ్రీకృష్ణ యాదవ సంఘం అధ్యక్షుడు మేకల శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ ఉత్సవానికి ఎంపీ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. గోదావరిఖనిలో తొలిసారిగా సదర్ఉత్సవం నిర్వహించిన యాదవ సమాజాన్ని ఆయన అభినందించారు.
అనంతరం దున్నమెడలో పూలదండ వేశారు. ఉత్సవంలో నాలుగు దున్నలు కవాత్ చేస్తూ ఉత్సాహపరిచాయి. కార్యక్రమంలో కర్ణాటక ఎమ్మెల్సీ నాగరాజు యాదవ్, యాదవ సంఘం నేషనల్ ఆర్గనైజింగ్‌సెక్రటరీ మహేంద్రనాథ్యాదవ్, అయిలయ్యయాదవ్, సదానందం, మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.