చదువుతోపాటు ఆటలూ ముఖ్యమే:పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

  • కాకా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్కూల్​లో ఘనంగా స్పోర్ట్స్ డే
  • సందడిగా సాగిన పీజీ స్టూడెంట్ల ఫ్రెషర్స్​డే

ముషీరాబాద్, వెలుగు: బాల్యంలో ఆటలు చాలా ముఖ్యమని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. చదువుతోపాటు స్పోర్ట్స్​లో రాణించాలని స్టూడెంట్లకు సూచించారు. శుక్రవారం బాగ్ లింగంపల్లిలోని కాకా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్కూల్ లో స్పోర్ట్స్ డేను ఘనంగా నిర్వహించారు. 

ముఖ్య అతిథిగా ఎంపీ వంశీకృష్ణ పాల్గొని సెలబ్రేషన్స్​ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆటలతో శారీరక దృఢత్వంతోపాటు చురుకుదనం పెరుగుతుందన్నారు. అంబేద్కర్​ విద్యా సంస్థల్లోని స్టూడెంట్లు చదువుతోపాటు ఆటల్లో రాణించేలా యాజమాన్యం సహకరిస్తోందన్నారు.

ఈ అవకాశాన్ని వినియోగించుకొని పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం క్రీడల్లో ప్రతిభ కనబరిచిన స్టూడెంట్లకు సర్టిఫికెట్లు, మెడల్స్​అందజేశారు. అలాగే కాకా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పీజీ కాలేజీ స్టూడెంట్ల ఫ్రెషర్స్ డే సంబరాలు శుక్రవారం కాలేజీ ఆవరణలో సందడిగా సాగాయి. 

ఆట, పాటలతో స్టూడెంట్లు హోరెత్తించారు. ఎంపీ వంశీకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని క్రమశిక్షణ, పట్టుదలతో ప్రయత్నిస్తే అనుకున్నది సాధించగలని చెప్పారు. కాకా వెంకటస్వామి ఆశయాలను, ఆలోచనలను స్టూడెంట్లతో పంచుకున్నారు. 

కార్యక్రమంలో కాలేజీ డైరెక్టర్ విష్ణుప్రియ, ప్రిన్సిపాల్ డాక్టర్ మట్ట శేఖర్, స్కూల్​ప్రిన్సిపల్ విఠలాచారి, కుమారస్వామి, డాక్టర్ బి శ్రీధర్, వేమన రెడ్డి, అశోక్ గౌడ్, వెంకటేశ్​తోపాటు బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.