ఎన్టీపీసీ పెనాల్టీని అభివృద్ధి పనులకు వినియోగిస్తాం : పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

ఎన్టీపీసీ పెనాల్టీని అభివృద్ధి పనులకు వినియోగిస్తాం : పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

గోదావరిఖని, వెలుగు: బల్దియా పర్మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకోకుండా ఎన్టీపీసీ చేపట్టిన నిర్మాణాలకు వేసిన పెనాల్టీని అభివృద్ధి పనులకు వినియోగిస్తామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. మంగళవారం మంచిర్యాల జిల్లా క్యాతన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రామగుండం బల్దియా పర్మిషన్​ తీసుకోకుండా నిర్మాణాలు చేపట్టిన ఎన్టీపీసీపై చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యుత్​శాఖ మంత్రి ఖట్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అనుమతిలేకుండా ఆరు చోట్ల ఎన్టీపీసీ నిర్మాణాలు చేపడితే కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూ.99.28 కోట్ల ఫైన్​విధించిందన్నారు.

పర్మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకోవడంలో ఎన్టీపీసీ ఆఫీసర్లు నిర్లక్ష్యం చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరినట్లు చెప్పారు. తన లెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కేంద్ర మంత్రి స్పందించారని, ఎన్టీపీసీ తరఫున రామగుండం కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.100కోట్లకు పైగా కంట్రీబ్యూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసేందుకు అంగీకరించారన్నారు. ఈ మొత్తాన్ని బల్దియా అభివృద్ధికి వినియోగించేలా చూస్తామన్నారు. రామగుండం ప్రాంత అభివృద్ధికి సీఎస్ఆర్ నిధులు కేటాయించేలా ఎన్టీపీసీపై ఒత్తిడి తెస్తామన్నారు. విద్యుత్ కర్మాగారంలో స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలా కృషి చేస్తానని చెప్పారు.