- పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
పెద్దపల్లి, వెలుగు : పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన చికెన్ సెంటర్ యజమాని అజీజుల్రహమాన్ముజ్జు ఆకస్మిక మరణం బాధాకరమని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. జిల్లా కేంద్రంలో చాలాకాలంగా చికెన్ సెంటర్ నిర్వహిస్తున్న ముజ్జు సోమవారం గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎంపీ వంశీ, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావుతో కలిసి ముజ్జు ఇంటికి చేరుకొని మృతుడి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.
అంతకుముందు కమాన్‌పూర్ మండలం జూలపల్లికి చెందిన ఎన్‌ఎస్‌యూఐ లీడర్ జెమినీ గౌడ్ తండ్రి కొమురయ్యగౌడ్ ఇటీవల చనిపోగా ఆయన దశదినకర్మకు మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి హాజరయ్యారు.