బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎంపీ

బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎంపీ

కోల్​బెల్ట్, వెలుగు : కన్నెపల్లి మండలం జన్కాపూర్​కు చెందిన మాజీ ఎంపీటీసీ ముసిపట్ల సత్తయ్య, భీమిని మండలం వెంకటాపూర్​కు చెందిన మాజీ సర్పంచి దారిశెట్టి వెంకన్న, మందమర్రి పాతబస్టాండ్​ ఏరియాకు చెందిన కాంగ్రెస్​ కార్యకర్త నీలం కొమురయ్య వివిధ కారణాలతో ఇటీవల మృతిచెందారు. విషయం తెలుసుకున్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సోమవారం మృతుల బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించారు. 

కార్యక్రమాల్లో బెల్లంపల్లి మార్కెట్​కమిటీ మాజీ వైస్​ చైర్మన్ నర్సింగరావు, మందమర్రి టౌన్​ ప్రెసిడెంట్​ నోముల ఉపేందర్​గౌడ్, కాంగ్రెస్ ​లీడర్లు సొత్కు సుదర్శన్, బండి సదానందం యాదవ్, బత్తుల రమేశ్, అకారం రమేశ్, తిరుమల్, జావిద్​ఖాన్, రాయబారపు కిరణ్, లక్ష్మీనారాయణ, రామాంజనేయులు, బోరిగం తిరుపతి, ఎండీ అంకూస్, శ్రీహరిరావు తదితరులు పాల్గొన్నారు.