పెద్దపల్లి ఎంపీకి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు ఘన స్వాగతం 

పెద్దపల్లి ఎంపీకి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు ఘన స్వాగతం 

ధర్మారం, వెలుగు : పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు ధర్మారంలో ఘన స్వాగతం పలికారు. గురువారం ఉదయం ధర్మపురి వెళ్తున్న ఎంపీని స్థానిక అంబేద్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చౌరస్తాలో కలిసి శాలువాతో సన్మానించారు. ఎంపీగా విజయం సాధించడం పట్ల అభినందనలు తెలిపారు.

అనంతరం స్థానిక నాయకులతో కలిసి టీ తాగుతూ వివిధ అంశాలపై ఎంపీ చర్చించారు. కార్యక్రమంలో నాయకులు కాడే సూర్యనారాయణ, కోమటిరెడ్డి రవీందర్ రెడ్డి, పాలకుర్తి రాజేశంగౌడ్, మెడవేని తిరుపతి, శంకరయ్య పాల్గొన్నారు.