మాతంగి కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి : పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

మాతంగి కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి : పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

గోదావరిఖని/ జ్యోతినగర్, వెలుగు: రామగుండం ఎన్టీపీసీ ప్లాంట్​సమీపంలోని మాతంగికాలనీ వాసుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి మాతంగి కాలనీని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కాలుష్యంతో తాము పడుతున్న ఇబ్బందులను కాలనీవాసులు ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మాతంగి కాలనీ ప్రజలు పడుతున్న సమస్యలను పార్లమెంట్​లో ప్రస్తావించానని తెలిపారు. మాతంగి కాలనీని సురక్షిత ప్రాంతానికి తరలించి ఆర్అండ్ఆర్​ ప్యాకేజీని వర్తింపచేయాలని ఎన్టీపీసీ మేనేజ్​మెంట్​కు సూచించారు. తమ సమస్యలను పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రస్తావించిన ఎంపీని కాలనీవాసులు శాలువాలతో సన్మానించారు.

కార్యక్రమంలో లీడర్లు పి.మల్లికార్జున్, సజ్జద్, జెట్టి రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జ్యోతి, దేవేందర్, భద్రయ్య, తిరుపతి రెడ్డి పాల్గొన్నారు.  అంతకుముందు ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయిన గోదావరిఖని ఎన్టీపీసీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మెరుగు లింగమూర్తి కుటుంబసభ్యులను ఎంపీ వంశీకృష్ణ పరామర్శించారు. 

కొత్త జంటకు ఆశీర్వాదం 

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి మండలం చీకురాయి గ్రామానికి చెందిన మాజీ జడ్పీటీసీ బండారి రామ్మూర్తి కూతురు లక్ష్మిదుర్గ పెండ్లి ఇటీవల జరిగింది. ఎంపీ గడ్డం వంశీకృష్ణ శుక్రవారం రామ్మూర్తి ఇంటికి వెళ్లి కొత్త జంటను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారు ఎంపీని సన్మానించారు. ఆయన వెంట దిశ కమిటీ మెంబర్​ సయ్యద్​సజ్జాద్, బండారి సునీల్, సతీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మహేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సంతోష్​, శ్రీనివాస్​, మనోజ్​, తదితరులు ఉన్నారు. 

పరామర్శ చెన్నూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యేకు సన్మానం 

కాంగ్రెస్​ సీనియర్​ నేత, చెన్నూర్​ ఎమ్మెల్యే డాక్టర్​గడ్డం వివేక్​వెంకటస్వామిని పెద్దపల్లికి చెందిన  పలువురు కాంగ్రెస్ నాయకులు కలిసి సన్మానించారు. ఆయన శుక్రవారం హైదరాబాద్​ నుంచి చెన్నూర్​ వెళ్తున్నారు. వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలిసిన వారిలో సయ్యద్​ సజ్జాద్​, సురేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సునీల్, సతీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, శ్రీధర్​, సంతోష్​ పాల్గొన్నారు.