పెద్దపల్లి, వెలుగు : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పలు కుటుంబాలకు చెందిన శుభకార్యాలకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూర్ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన మ్యాడగోని మల్లేశం కుమార్తె అనూష వివాహం నేడు జరగనుంది. బుధవారం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ ఆమెను ఆశీర్వదించారు.
అలాగే ఓదెల మండల కేంద్రానికి చెందిన అల్లం సతీశ్ కుమార్తె హర్షిక నూతన వస్త్రాలంకరణ కార్యక్రమానికి హాజరయ్యారు. వారివెంట నాయకులు సజ్జాద్, బాలసాని సతీశ్, గుండేటి ఐలయ్యయాదవ్, గంగుల సంతోష్, బండారు సునీల్, కొండి సతీశ్, ప్రశాంత్, శ్రీనివాస్ తదితరులున్నారు.
బాబర్ సలీం పాషకు పరామర్శ
జ్యోతి నగర్, వెలుగు : ఐన్టీయూసీ జాతీయ కార్యదర్శి, ఎన్బీసీ మెంబర్ బాబార్ సలీం పాష మంగళవారం గుండె పోటుకు గురై కరీంనగర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి బుధవారం బాబర్ ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.