పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి కాంగ్రెస్ టికెట్ పార్టీ యువనేత గడ్డం వంశీకృష్ణకే ఇవ్వాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు పాటకుల మహేశ్, స్టేట్లీడర్లు మాదాసి విజయ్, ఆనంద్ కుమార్ మంగళవారం ఓ ప్రకటనలో హైకమాండ్‌ను కోరారు. కాకా వెంకటస్వామి, డాక్టర్ వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో గతంలో పెద్దపల్లి ఎంతో అభివృద్ది చెందిందన్నారు. కాక కుటుంబం విశాక ట్రస్ట్ ద్వారా ఎన్నోసేవా కార్యక్రమాలు చేపట్టారన్నారు.
తాగునీటి కోసం బోర్ వెల్స్, స్కూళ్లకు బెంచీలు, చిరు వ్యాపారులకు సోలార్ తో కూడిన తోపుడు బండ్లు అందజేశారన్నారు. అలాంటి కుటుంబానికి చెందిన గడ్డం వంశీకృష్ణకు కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇచ్చి అభ్యర్థిగా బరిలో నిలుపాలన్నారు. వంశీకి టిక్కెట్ ఇస్తే అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని పేర్కొన్నారు.