అదానీ వ్యవహారంపై పార్లమెంట్ లో చర్చ జరగాలన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. దేశంలోని కాంట్రాక్టుల కోసం 2వేల కోట్ల లంచం ఇచ్చారన్న ఆరోపణలపై అదానీపై అమెరికాలో కేసు నమోదు అయ్యిందన్నారు. పార్లమెంట్ ఆవరణలో జరిగిన ఇండియా కూటమి నేతల ఆందోళనలో పాల్గొన్నారు. అదానీ గ్రూప్ ముడుపుల వ్యవహారంపై ఉభయ సభల్లో చర్చించాలని డిమాండ్ చేశారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. ఆందోళనల్లో రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పాల్గొన్నారు.
మరో వైపు పార్లమెంట్ ఆరో రోజు సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అదానీ ఇష్యూపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. విపక్షాలు చర్చలకు సహకరించాలని కోరుతోంది కేంద్ర ప్రభుత్వం. అయితే దేశంలోని అదానీ, మణిపూర్, సంభాల్ ఇష్యూలపై చర్చ జరగాల్సిందేనని పట్టుబడుతున్నారు ఇండియా కూటమి నేతలు. తమిళనాడు వర్షాలపై చర్చించాలని కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ లోక్ సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. ఇక ఢిల్లీలోని ప్రజాప్రతినిధులకు బెదిరింపులపై డిస్కషన్ చేయాలని ఆప్ ఎంపీలో నోటీసులిచ్చారు.