జువ్వాడి రత్నాకర్ రావు నిస్వార్థ రాజకీయాలకు ప్రతిరూపమని అన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. అక్టోబర్ 4న కోరుట్లలో జువ్వాడి విగ్రహావిష్కరణలో పాల్గొన్న వంశీకృష్ణ..
గ్రామ సర్పంచ్ నుంచి ఉమ్మడి ఏపీకి రాష్ట్ర మంత్రిగా ఎదిగిన గొప్ప నాయకుడు రత్నాకర్ రావు అని కొనియాడారు. తెలంగాణ సాయుధ పోరాట సమయంలో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి జైలు జీవితం గడిపారని చెప్పారు.
10 సంవత్సరాల క్రితం తన తాత కాకా వెంకటస్వామితో కలిసి రత్నాకర్ రావుని మొదటి సారి కలిసినట్టు చెప్పారు ఎంపీ వంశీకృష్ణ. ఏదైనా చేయాలనుకుంటే క్రమశిక్షణతో పని చేయాలని రత్నాకర్ రావు చెప్పేవారన్నారు. ఇవాళ రత్నాకర్ రావు విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.