రామగుండంలో వందే భారత్ సూప్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ను పచ్చ జెండా ఊపి ప్రారంభించారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. ఈ సందర్బంగా మాట్లాడిన ఎంపీ వంశీకృష్ణ..రామగుండం రైల్వేస్టేషన్లో వందే భారత్ హాల్టింగ్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. పార్లమెంట్ పరిధిలో వందే భారత్ హాల్టింగ్ ఇవ్వాలని గతంలె రైల్వే శాఖ మంత్రిని కోరామని చెప్పారు. రైల్వేకు 10 వేల కోట్లకు పైగా సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంతం నుంచే సహకారం అందుతుందన్నారు.
ALSO READ | గణనాథుడి ఆశీర్వాదంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం: MP వంశీకృష్ణ
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ప్రజలకు పాలన అందిస్తున్నామని చెప్పారు వంశీకృష్ణ. కాక వెంకటస్వామి మనవడిగా తనను ఎంపీగా గెలిపించిన పారిశ్రామిక ప్రాంత ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో రామగుండం మేయర్ అనిల్ కుమార్, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్,పలువురు అధికారులు పాల్గొన్నారు.