కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని.. ఇప్పటికైనా స్పందించి వెంటనే నిధులు మంజూరు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ స్వయంగా కలిసి కోరారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. 2024, జూలై 25వ తేదీ పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తో సమావేశం అయ్యారాయన.
తెలంగాణ రాష్ట్రం నుంచి 18 ప్రతిపాదనలు వచ్చాయని.. బడ్జెట్ ఏ ఒక్క ప్రతిపాదనకు నిధులు కేటాయించలేదని.. ఇప్పటికైనా ప్రజల ఆకాంక్షాలకు అనుగుణంగా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఎంపీ వంశీ కృష్ణ.
ఐటీఐఆర్ ప్రాజెక్టు, రీజనల్ రింగ్ రోడ్డు, మూసీ రివర్ ఫ్రంట్, నీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుతోపాటు.. సింగరేణికి కేటాయించిన నిధుల్లోనూ కోత విధించటాన్ని ఆర్థిక మంత్రి నిర్మల దృష్టికి తీసుకెళ్లారు ఎంపీ వంశీకృష్ణ. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ప్రజలు కూడా అసంతృప్తితో ఉన్నారని.. ఇప్పటికైనా స్పందించిన నిధుల కేటాయించాలని కోరారు ఎంపీ.