
రామగుండం ప్రాంతంలో ఎయిర్‌పోర్టు అవ సరం ఎంతో ఉంది. ఇక్కడ సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, జైపూర్ఎస్టీపీపీ, బసంత్నగర్సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆయా పరిశ్రమల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు చాలా మంది పని చేస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి విదేశాలకు కూడా ఎక్కువ మంది జాబ్ లు, స్టడీస్ కోసం వెళ్తుంటారు.
పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్ వంటి పట్టణాల నుంచి విమాన సర్వీసుల కోసం వందల కిలోమీటర్లు ప్రయాణించి హైదరాబాద్‌కు వెళ్తుంటారు. రామగుండంలో ఎయిర్‌పోర్టు ఉంటే ఆయా ప్రాంతాలవారికి సమయం ఆదాతో పాటుప్రయాణం ఈజీ అవుతుంది. రోడ్డు, రైలు కనెక్టివిటీ ఉండడంతో సమీప రాష్ట్రాలకు వెళ్లే వారికి కూడా ఎయిర్ పోర్టు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. రామగుండంలో ఎయిర్ పోర్టు ఏర్పాటుకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడుకు లేఖ అందజేసి వివరించాను. స్పందించిన కేంద్ర మంత్రి ఆదేశాలతో బసంత్‌నగర్, అంతర్గాంలో భూముల రీ సర్వే చేపట్టింది. త్వరగా ఎయిర్‌పోర్టుకు అనుమతి ఇచ్చే లా మరోమారు కేంద్ర మంత్రిని కలిసి కోరు తాను.
- గడ్డం వంశీకృష్ణ, పెద్దపల్లి ఎంపీ