పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణకు సింగరేణి స్టేడియం వాకర్స్ సన్మానం

పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణకు సింగరేణి స్టేడియం వాకర్స్ సన్మానం
  • వాకర్స్ సమస్యలనుల పరిష్కరిస్తానని హామి
  • గోదావరిఖనిలో అండేడ్కర్ భవనం, సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటుకు కృషి చేస్తా
  • రామగుండం పట్టణాన్ని అభివృద్ది చేస్తా-పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ  పర్యటించారు.  సింగరేణి స్టేడియంలో వాకింగ్ చేసిన ఎంపీను  వాకర్స్ శాలువాతో సన్మానించారు.  స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎంపీ.. పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.  స్టేడియంలో వాకింగ్ చేసే వారు ఇబ్బంది పడుతున్నామని పలు సమస్యను ఎంపీ దృష్టికి తెచ్చారు.  టాయిలెట్స్.. కూర్చొనేందుకు బల్లలు కావాలని .. వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమస్యలను పరిష్కరిస్తానని హామీ  ఇచ్చిన పెద్దపల్లి ఎంపీ.. గోదావరిఖనిలో అండేడ్కర్ భవనాన్ని నిర్మాణానికి.. సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.  అలాగే రామగుండం అభివృద్దికి సహకరిస్తానన్నారు పెద్దపలి ఎంపీ వంశీకృష్ణ...

గోదావరిఖనిలో పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ పర్యటనలో భాగంగా ఏడవ డివిజన్ కార్పొరేటర్.. స్థానిక కాంగ్రెస్ నేత బొంతల రాజేశంను పరామర్శించి.. ఆయన ఆరోగ్యం పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రాజేశం అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు.  ఎంపీ తో తో పాటు  INTUC జాతీయ నాయకులు బాబర్ సలీం పాషా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.