పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ కృషి ఫలితం.. ఎయిర్​ పోర్ట్​ నిర్మాణానికి గ్రీన్​ సిగ్నల్​?

పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ  కృషి ఫలితం..  ఎయిర్​ పోర్ట్​ నిర్మాణానికి గ్రీన్​ సిగ్నల్​?

పెద్దపల్లి జిల్లా  ప్రజల  కల రెండు దశాబ్దాల తరువాత నెర వేరబోతుంది.  ఎంపీ గడ్డం వంశీ కృష్ణ ఎయిర్​ పోర్ట్​ను నిర్మించేందుకు భూములను రీసర్వే జరిపి.. బసంత్​నగర్​ లో ఎయిర్​ పోర్ట్​ నిర్మించాలని  కేంద్రమంత్రి కింజారపు రామ్మోహననాయుడికి వినతిపత్రం సమర్పించారు.  దీంతో  అంతర్గాం మండల కేంద్రంలోని టెక్స్​టైల్ భూముల్లో  ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఉన్నతాధికారులు పర్యటించి.. ఎయిర్​ పోర్ట్ ప్రతిపాదిత స్థలాన్ని సందర్శించారు.గతంలో సమర్పించిన భూ రికార్డుల ఆధారంగా ఆ స్థలాన్ని పరిశీలించారు. ఏఏఐ డీజీఎం మల్లిక సారథ్యంలో ముగ్గురు ఆఫీసర్ల బృందం ..పాలకుర్తి మండలం బసంత నగర్ పాత రన్ వే...  అంతర్గాం లోని ప్రతిపాదిత స్థలాన్ని మ్యాప్ ల ద్వారా పరిశీలించారు.

సమీపంలోని రైల్వే ట్రాక్ రాజీవ్ రోడ్డు కనెక్టివిటీ ... ఇరువైపులా పట్టణాలు   .. తదితర అంశాలపై రెవెన్యూ అధికారులతో చర్చించిన తరువాత బసంత్ నగర్ ఎయిర్​ పోర్ట్ భూములు పరిశీలించారు .  ఈ ప్రాంతంలో ఎయిర్​ పోర్ట్​ ఎక్కడ నిర్మించాలి.... భూములకు సంబంధించి ల్యాండ్​మార్క్​ ఇతర అంశాలను ఏఏఐ అధికారులు కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు. 

పెద్దపల్లి జిల్లాలో ఎయిర్​ పోర్ట్​ నిర్మాణానికి బసంత నగర్ లో  300 ఎకరాలు, అంతర్గాం నుంచి రాయదండి మధ్యలో 500 ఎకరాలు అందుబాటులో ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం  అందుతోంది . ఎంపీ గడ్డం వంశీకృష్ణ చొరవతో  ప్రతిపాదిత స్థలంలో త్వరలో ఎయిర్​ పోర్ట్​ నిర్మాణ పనులుప్రారంభమయ్యే అవకాశం ఉంది. రామగుండం ప్రాంతంలో ఎయిర్ పోర్ట్ చేస్తే ..ఉమ్మడి కరీంనగర్ జిల్లా తో పాటు ...జగిత్యాల జిల్లా వాసులకు సేవలు అందుబాటులోకి  రానున్నాయి. ముఖ్యంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతం కావడం తో వివిధ రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది.

రామగుండంలో ఎయిర్ పోర్ట్ నిర్మించాలని...  స్థల సేకరణ  రీ సర్వే చేయాలని  పది రోజుల క్రితం ( ఏప్రిల్​ 26 నాటికి)  కేంద్ర పౌర విమానయానా శాఖ మంత్రి కి ఎంపీ గడ్డం వంశీకృష్ణ  వినతిపత్రం సమర్పించారు. విమానాశ్రయం నిర్మాణం  విషయంలో ఎలాంటి రాజకీయ కుట్రలకు తావివ్వొద్దంటూ  కేంద్ర విమానాయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడికి...  పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ లేఖ రాయడంతో పాటు పలుమార్లు స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశారు.టెక్నికల్ ఫీజిబులిటీ రిపోర్ట్ పేరుతో బసంతనగర్ లో ఎయిర్ పోర్ట్ నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయొద్దని ఎంపీ వంశీకృష్ణ కేంద్ర మంత్రిని లేఖ ద్వారా కోరారు.  ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అథారిటీ ప్రతినిధులతో పాటు  స్థానిక అధికారులు పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య. అంతర్గాం తహశీల్దార్ రవీందర్ పటేల్ ఉన్నారు.