ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం : ఎంపీ వంశీ

ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం : ఎంపీ వంశీ
  •     ప్రజల ఆశీర్వాదంతోనే పార్లమెంట్‌‌‌‌‌‌‌‌లో ప్రశ్నిస్తున్నా
  •     పెద్దపల్లి ఎంపీ వంశీ

ధర్మపురి, వెలుగు : ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరుస్తామని, వారి ఆశీర్వాదంతోనే పార్లమెంట్‌‌‌‌‌‌‌‌లో ప్రశ్నిస్తున్నామని పెద్దపెల్లి ఎంపీ వంశీ చెప్పారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో గురువారం నిర్వహించిన వన మహోత్సవంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీ మాట్లాడుతూ 400 సీట్లు గెలుస్తామన్న మోదీకి ప్రజలు షాక్‌‌‌‌‌‌‌‌ ఇచ్చారన్నారు. పెద్దపల్లి ప్రాంత సమస్యలపై పోరాడి నిధులు తీసుకొచ్చి అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.

లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు. గ్లోబల్‌‌‌‌‌‌‌‌ వార్మింగ్ వల్ల ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయని, దీనిని తగ్గించేందుకు ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని సూచించారు. ధర్మపురిలో తాగునీటి సమస్య పరిష్కారానికి రూ. 2.70 కోట్లతో పనులు చేపట్టినట్లు గుర్తు చేశారు. అనంతరం ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ ధర్మపురి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో వంశీ ఎంపీగా గెలిచారని

ఆయనకు సమస్యలపై పోరాడేంత ధైర్యం ఇవ్వాలని స్వామిని కోరుతున్నామన్నారు. అంతకుముందు లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేసి, శాలువాతో సత్కరించారు.