పెద్దపల్లి జిల్లాలో రైతుల ఆందోళన

పెద్దపల్లి జిల్లాలో రైతుల ఆందోళన

అకాల వర్షాలతో నష్టపోయిన పెద్దపల్లి జిల్లా రైతులు ఆందోళనకు దిగారు. పెద్దపల్లి అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో చేశారు. దాదాపు పది ట్రాక్టర్లలో చేరుకున్న వివిధ గ్రామాల రైతులు.. వానకు పాడైన వరితో రోడ్డుపై బైఠాయించారు. ఆ తర్వాత కలెక్టరేట్ కు చేరుకుని ధర్నా చేశారు బాధిత రైతులు.

రైతుల రాస్తారోకోతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు సర్దిచెప్పి ధర్నా విరమింపజేశారు. ఆ తరువాత రైతులతో మాట్లాడిన జాయింట్ కలెక్టర్ వనజాదేవి… ప్రభుత్వానికి నివేదిక పంపామన్నారు. తమకు న్యాయం చేయాలని కోరిన రైతులు.. నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.