జగిత్యాల: భూదందాలు, ఇసుక దందాలతో బీఆర్ఎస్ నేతలు కోట్లు కొల్లగొట్టిన్రని పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతులకు చేసిందేమీ లేదు.. ఏ మొఖం పెట్టుకొని రైతులను ఓట్లడుగుతున్నారని విమర్శించారు. బీఆర్ ఎస్ నేతలు దళిత, కార్మిక ద్రోహులని ఆరోపించారు. యువత కోసం ఇండస్ట్రీలు తీసుకొచ్చి ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తానన్నారు వంశీకృష్ణ. కాకా వెంకటస్వామి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చాను. అధికారంలో ఉన్నా లేకున్నా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి విశాఖ ట్రస్ట్ ద్వారా సేవ కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వందరోజుల్లోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఐదు గ్యారంటీలను నెరవేర్చిందని అన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ.
పదేళ్లలో ఒక్క డబుల్ బెడ్ రూం ఇళ్లు కూడా ఇవ్వలేదు: వివేక్ వెంకటస్వామి
జగిత్యాల: గత బీఆర్ ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పదేళ్ల పాలనలో పేదలకు ఒక్క డబుల్ బెడ్ ఇళ్లు కూడా కట్టించలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమయంలో రూ. 70వేల కోట్లు మిగులు ఉంటే.. ఇప్పుడేమో లక్షల కోట్ల అప్పులు మిగిల్చారన్నారు. మిషన్ భగీరథ పేరుతో 40వేల కోట్లు వృధా చేశారని..ఎవరికీ చుక్క నీరు అందలేదని అన్నారు వివేక్ వెంకటస్వామి.
1995లోనే కాకా వెంకటస్వామి సీఎంతో కొట్లాడి సింగరేణి సంస్థను కాపాడుకుంటూ వచ్చారు. కొప్పుల ఈశ్వర్ ఏనాడైనా సింగరేణి గురించి కొట్లాడాడా అని ప్రశ్నించారు.గత ప్రభుత్వంలో మంత్రి గా ఉన్న కొప్పుల ఈశ్వర్.. కమిషన్ మింగిండు తప్పా ఇక్కడి ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయలేదన్నారు .. కొప్పుల ఈశ్వర్ కనీసం జూనియర్, డిగ్రీ కాలేజీ కూడా తీసుకురాపోయారని విమర్శించారు.
సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల హామీలో భాగంగా ఇప్పటికే పేదలకు 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం..ఫ్రీ బస్సుతో మహిళలకు లబ్ధి జరుగుతోందన్నారు. రూ.500లకే గ్యాస్ ఇస్తున్నామన్నారు. ఎన్నికల తర్వాత రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద రూ. 10 లక్షల వైద్య ఉచిత పథకం అందుబాటులోకి వచ్చింది. రైతుల కోసం రూ.2లక్షల రుణమాఫీ ఇచ్చేందుకు బ్యాంక్లర్లతో మాట్లాడారు. ఆగస్టులో రునమాఫీ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. పేదలకు న్యాయం జరగాలంటే.. పెద్దపల్లి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్తం గడ్డం వంశీకృష్ణ ను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.