పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్‌‌లో చేరికలు

పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్‌‌లో చేరికలు

సుల్తానాబాద్, వెలుగు: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం  పోత్కపల్లి గ్రామంలోని  బీఆర్ఎస్ కు చెందిన పలువురు లీడర్లు, కార్యకర్తలు ఎమ్మెల్యే విజయ రమణారావు సమక్షంలో కాంగ్రెస్‌‌లో చేరారు. శుక్రవారం ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలోని తన నివాసంలో ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చేరినవారిలో మాజీ సర్పంచులు దాసరి రాజన్న, గడ్డం లక్ష్మి, లీడర్లు మొండయ్య, రాజయ్య, పిట్టల అంజయ్య, రాజేందర్, సుధాకర్, జంపయ్య, రెడ్డి శంకర్, పల్లె కుమార్, రాములు, సదానందం, రాములు ఉన్నారు. 

 
ముకుందరెడ్డికి నివాళులు

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి 10వ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణారావు,  కాల్వ శ్రీరాంపూర్​ మండలం కునారంలోని ముకుందరెడ్డి ఘాట్​ వద్ద నివాళులు అర్పించారు.