- పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు
పెద్దపల్లి, వెలుగు: తాను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం నియోజకవర్గంలోని రైతులకు అన్యాయం జరగనివ్వనని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో గురువారం పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లలో కోతలు విధిస్తే సహించేది లేదన్నారు. కోనుగోళ్లపై అధికారులు దృష్టి సారించాలన్నారు. సన్న రకాల ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లిస్తామన్నారు. మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఈర్ల స్వరూప, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, అధికారులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.