పెద్దపల్లి, వెలుగు: ఎంపీగా గెలిపిస్తే మంత్రి శ్రీధర్‌బాబు స్ఫూర్తితో పనిచేస్తానని పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని కేంద్రంగా గురువారం మంథని పట్టణం శ్రీపాదకాలనీ ప్రజలు ఏర్పాటు చేసిన మంత్రి శ్రీధర్‌బాబు ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి గడ్డం వంశీ హాజరై మాట్లాడారు. ముందుగా వివిధ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్తోపాటు ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు మంత్రి శ్రీధర్‌బాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు.
పార్టీలో చేరిన వారికి మంత్రి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వంశీ మాట్లాడుతూ మంత్రి ఆత్మీయ సన్మానానికి రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. కాకా వెంకటస్వామి, శ్రీపాదారావుల సాన్నిహిత్యాన్ని ఈ సందర్భంగా వంశీకృష్ణ గుర్తు చేశారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు ఆకర్షితులై పార్టీలోకి చేరుతున్నారన్నారు.