రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నం.. రాహుల్తో కలిసి ధర్నాలో ఎంపీ వంశీకృష్ణ

రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నం.. రాహుల్తో కలిసి ధర్నాలో ఎంపీ వంశీకృష్ణ

బీజేపీ పాలనలో రాజ్యాంగం ప్రమాదంలో పడిందన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని మండిపడ్డారు.  పార్లమెంట్ ఆవరణలో లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో కలిసి ఆదానీ ఇష్యూపై నిరసనల్లో పాల్గొన్నారు వంశీకృష్ణ.  రాజ్యాంగ ప్రతులను చేతిలో పట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.  ప్రతి ఒక్కరు రాజ్యాంగ రక్షణ పోరులో కలిసి రావాలన్నారు. 

నిరసనల్లో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక, కాంగ్రెస్ ఎంపీలు పాల్గొన్నారు. అదానీ- మోడీ భాయ్ భాయ్ అంటూ ముఖానికి మాస్కులు ధరించి నిరసన తెలిపారు.  అంతకు ముందు పార్లమెంట్ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహానికి నివాళి అర్పించారు.

బిలియనీర్ గౌతమ్ అదానీ ఇష్యూపై జేపీసీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అదానీ ముడుపుల వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలతో విచారణ చేయించాలని నినాదాలు చేశారు.  అనంతరం పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు.  సభ ప్రారంభమైన కాసేపటికే  విపక్షాల ఆందోళనతో  లోక్ సభ సమావేశాలు డిసెంబర్ 9 కు వాయిదా పడ్డాయి.