హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ 2024-25 లో తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. మంగళవారం(జూలై 23) పార్లమెంట్ లో ప్రవేశపెట్టినబడ్జెట్ లో తెలంగాణ రాష్ట్ర ఊసేలేదని..తెలంగాణకు కేటాయింపుల్లో కేంద్రంలోని బీజేపీ పూర్తిగా విఫలమైందన్నారు వంశీకృష్ణ. తెలం గాణ ప్రజలకు బీజేపీ ఎంపీలను సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన సందర్బంగా తెలంగాణకు ఇచ్చిన హామీలపై ఎలాంటి కేటాయింపులు లేవని అన్నారు. బడ్జెట్ లో తెలంగాణ విభజన హామీల ప్రస్తావన లేకపోవడం బాధాకరం అన్నారు.
Also Read:-ఉద్యోగాలు, పొలిటికల్ ప్రయార్టీలపైనే బడ్జెట్
గత పదేండ్లలో బీజేపీ, బీఆర్ ఎస్ లు రాష్ట్రానికి తీరని అన్యాయం చేశాయన్నారు ఎంపీ వంశీకృష్ణ. మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తి పొలిటికల్ బడ్జెట్ అ న్నారు ఎంపీ వంశీకృష్ణ.బీజేపీకి మద్దతిస్తున్నందుకే ఆంధ్రప్రదేశ్,బీహార రాష్ట్రాలకు నిధులు వరద పారించారన్నారు. దేశంలో నిరుద్యోగం భారీగా పెరిగిపోయిం దన్నారు. బడ్జెట్ లో యువతను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. పార్లమెంట్ లో కొట్లాడి తెలంగాణకు నిధులు తెస్తామన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ.