మంథని టౌన్, వెలుగు: పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గడ్డం వంశీకి ఇవ్వాలని ఆ పార్టీ మంథని మండల నాయకులు హైకమాండ్‌ను కోరారు. సోమవారం మంథని ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ గడ్డం వెంకటస్వామి(కాకా), వివేక్ వెంకటస్వామి ఎంపీలుగా పెద్దపల్లిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు.
వివేక్ వెంకటస్వామి కుమారుడు, యువనేత వంశీకి పెద్దపల్లి టికెట్ ఇస్తే భారీ మెజారిటీతో గెలిపించుకుంటామన్నారు. కార్యక్రమంలో నాగేపల్లి మాజీ సర్పంచ్ తోటపల్లి గట్టయ్య, లీడర్లు హరీశ్, కాసిపేట మల్లయ్య, ఒంగిడి రాజేందర్, రాజ బొందయ్య, కిరణ్, అఖిల్, అశోక్, అనిల్ పాల్గొన్నారు.