ఎడ్యుకేషన్ బాగుంటేనే దేశం బాగుంటుంది..అభివృద్ధి చెందుతుందన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. గోదావరిఖని ప్రశాంత్ నగర్ లోని జ్యోతి బాపులే బీసీ వెల్ఫేర్ హాస్టల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. పిల్లలు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని పిలుపునిచ్చారు. తల్లి తండ్రుల పేరు నిలబెట్టాలని విద్యార్థులకు పలు సూచనలు చేశారు.
తరగతీ గదులు,వాష్ రూమ్స్, భోజన శాల పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు ఎంపీ వంశీకృష్ణ. వాష్ రూమ్స్ నీటిగా లేకపోవడం తో స్కూల్ సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. చదువుతో పాటు భోజనం మెనూ ప్రకారం అందిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. పిల్లల జీవితం బాగుండాలని పిల్లల తల్లితండ్రులు ప్రభుత్వం పై ఎంతో నమ్మకం ఉండి..హాస్టల్స్ లో జాయిన్ చేస్తారు.
ALSO READ | మహాశివరాత్రికి ఘనంగా ఏర్పాట్లు
విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి. ఫుడ్ పాయిజన్ కేసులు పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. స్కూల్లో కొన్ని సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకు రావడంతో .. ఎంపి ల్యాడ్స్ నుంచి తన సహాయ సహకారాలు అందించి సమస్యలు తీరుస్తానని హామీ ఇచ్చారర.