చదువు ప్రతి ఒక్కరి హక్కు.. చదువుకుంటేనే బాగుపడతాం: పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

చదువు ప్రతి ఒక్కరి హక్కు.. చదువుకుంటేనే బాగుపడతాం: పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

పెద్దపల్లి: చదువు ప్రతి ఒక్కరి హక్కు.. చదువుకుంటేనే జీవితంలో బాగు పడతామన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. శనివారం(అక్టోబర్19) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ లోని సోషల్ వెల్ఫేర్ స్కూల్ కు ఎంపీ వంశీకృష్ణ ఫర్నిచర్ పంపిణీ చేశారు.  

ఇచ్చిన హామీ ప్రకారం.. మూడు విడతలుగా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకోసం 150 బెంచీలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా స్కూల్ సిబ్బంది ఎంపీ వంశీకృష్ణను శాలువా కప్పి సత్కరించింది. ఈ కార్యక్రమంలో ధర్మారం మండల కాంగ్రెస్ నాయకులు విశాఖ ట్రస్ట్ సభ్యులు కాడే సూర్యనారాయణ, కాకా వెంకటస్వామి అభిమానులు, విద్యార్థులు పాల్గొన్నారు. 

పెద్ద పల్లి ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ.. కాక, విశాఖ చారిటబుల్ ట్రస్ట్ లుబడుగు బలహీన వర్గాలకు చేయూతనిస్తున్నాయన్నారు. స్కూల్లో  విద్యార్థులు కింద కూర్చోవడం చూసి చలించిపోయిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఫర్నీచర్ అందిస్తున్నారని తెలిపారు. 

ALSO READ | కేటీఆర్,హరీశ్ అక్రమాలు తేలుస్తాం: సీఎం రేవంత్

చదువు మన హక్కు దాని వినియోగించుకుంటే జీవతం బాగుంటుందన్నారు ఎంపీ వంశీకృష్ణ. పేద విద్యార్థులకు విద్యను అందించాలనే లక్ష్యంతో కాక వెంకటస్వామి.. అంబేద్కర్ విద్యా సంస్థల ను స్థాపించారని తెలిపారు.50 యేండ్లుగా అంబేద్కర్ విద్యాసంస్థలు ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దాయన్నారు. అంబేద్కర్ విద్యాసంస్థల్లో చదువుకున్న చాలామంది ఐఏఎస్,ఐపీఎస్ లను అయ్యారన్నారు. 

విద్యార్థులకు ఏ అవసరమున్నా కాకా వెంకటస్వామి స్ఫూర్తితో ఆదుకుంటామన్నారు. సోషల్ వెల్ఫేర్ స్కూల్ కి బోర్ కావాలని అడిగారు..అలాగే స్కూల్ ముందు షెడ్డు ఏర్పాటు చేయాలని కోరారు త్వరలో సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు ఎంపీ వంశీకృష్ణ.