
శివరాత్రి సందర్భంగా పెద్దపల్లి పట్టణంలోని మడ్ల రామలింగేశ్వరస్వామి ఆలయం, గోదావరిఖనిలోని జనగామ శ్రీ త్రిలింగ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. స్వామివారికి అభిషేకం నిర్వహించారు.
పరమశివుడి ఆశీస్సులతో పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరారు. పెద్దపల్లి ప్రాంతాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు వంశీ . ప్రజల కష్టాలు తొలగి రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తానన్నారు ఎంపీ వంశీ కృష్ణ.