
మేడిపల్లి, వెలుగు: బోడుప్పల్లో ఇటీవల హత్యకు గురైన జిమ్ ట్రైనర్ సాయికిశోర్ కుటుంబాన్ని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్బంగా కిశోర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కిశోర్ హత్యకు గల కారణాలను తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, మాజీ కార్పొరేటర్ పద్మా జయరాములు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.