అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను అమిత్ షా అవమానించారని విమర్శించారు. దళితులను అమిత్ షా అవమానించారని చెప్పారు. దళితుల కోసం అంబేద్కర్ నిరంతరం తపించారని తెలిపారు. అంబేద్కర్ పై అమిత్ షా తన అక్కసు వెళ్లగక్కారన్నారు. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడమే బీజేపీ పనిగా పెట్టుకుందని విమర్శించారు వంశీకృష్ణ. దళితులపై ఎన్ని దాడులు జరిగినా అమిత్ షా మాట్లాడట్లేదన్నారు.
భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంది.. ఈ కుట్రను కాంగ్రెస్ అడ్డుకుని తీరుతుందన్నారు వంశీకృష్ణ. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అమిత్ షా రాజీనామా చెయ్యాలి..వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు వంశీకృష్ణ. అమిత్ షా రాజీనామా చేసే వరకు నిరసనలు, ఆందోళనలు కొనసాగిస్తామన్నారు. ఎన్నికల ముందు బీజేపీ నిజస్వరూపం బయటపడి ఉంటే పార్లమెంట్ ఎన్నికల్లో 240 సీట్లు కూడా వచ్చేవి కావన్నారు వంశీకృష్ణ.
ALSO READ | జనవరిలో సీఎం రేవంత్రెడ్డి స్విట్జర్లాండ్ పర్యటన
అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా పార్లమెంట్ ఆవరణలో నిరసన చేస్తే... రాహుల్ గాంధీ ఆదివాసీ ఎంపీ మీద దాడి చేశారని బీజేపీ నేతలు డ్రామా క్రియేట్ చేశారన్నారు వంశీకృష్ణ. క్రియేటివ్ జీనియస్ లు, యాక్టర్లంతా బీజేపీలో ఉన్నారని.,అందుకే భారత్ కు ఆస్కార్ అవార్డులు ఎందుకు రావడం లేదని సెటైర్ వేశారు వంశీకృష్ణ. ప్రజలను తప్పుదోవ పట్టించడమే బీజేపీ నేతలు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.