సింగరేణి, ఎన్టీపీసీ కార్మికుల సమస్యలను పార్లమెంట్లో లేవనెత్తుతా : ఎంపీ వంశీకృష్ణ

సింగరేణి, ఎన్టీపీసీ కార్మికుల సమస్యలను పార్లమెంట్లో  లేవనెత్తుతా : ఎంపీ వంశీకృష్ణ

వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో సింగరేణి, ఎన్టీపీసీ కార్మికుల సమస్యలను లేవనెత్తుతానని పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ అన్నారు.  రామగుండం ఎన్టీపీసీ జ్యోతి భవన్ లో కాంటాక్ట్ కార్మికుల సమస్యలపై అధికారులతో  సమీక్ష సమావేశం నిర్వహించారు ఎంపీ వంశీకృష్ణ. ఈ సందర్భంగా   కాంట్రాక్టు కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.  

కాంట్రాక్ట్  కార్మికులకు అందించే గేట్  పాసులు నెల రోజులకు కాకుండా ఆరు నెలలకు  పెంచినట్లు ఎంపీకి తెలిపారు అధికారులు.   ఆరోగ్య సమస్యలు లేని కాంట్రాక్ట్ కార్మికులను యధావిధిగా వయసుతో సంబంధం లేకుండా కొనసాగించాలని ఆదేశించారు. సింగరేణి కార్మికుల సొంత ఇంటి కలతో పాటు మినహాయింపు వంటి అంశాలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్ళానని చెప్పారు వంశీకృష్ణ

అంతకుముందు  రామగుండం రైల్వే స్టేషన్ సుందరీకరణ పనులను పరిశీలించారు ఎంపీ వంశీకృష్ణ.  ఎంపీ వంశీకృష్ణకు ఘన స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు  రైల్వే అధికారులు.  అమృత్ స్కీంలో భాగంగా రామగుండం రైల్వే స్టేషన్ అధునాతన హంగులతో నిర్మిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలో  త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు ఎంపీ. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని రైల్వే అధికారులకు సూచించారు ఎంపీ వంశీకృష్ణ.