
వర్దన్నపేట(ఐనవోలు), వెలుగు: హనుమకొండ జిల్లా ఐనవోలు మల్లికార్జునస్వామి పెద్దపట్నం బుధవారం కనుల పండువగా జరిగింది. రాత్రి నందివాహన సేవ, భ్రమరాంబిక మల్లికార్జునస్వామి కళ్యాణోత్సవం నిర్వహించారు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రత్యేక పూజలు నిర్వహించి, పెద్ద పట్నం కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాగా, పెద్దపట్నం వేసిన తర్వాత ఆలయ అధికారుల కోసం గంట పాటు అపడంతో భక్తులకు ఇబ్బందులు పడ్డారు. పెద్ద ఎత్తున బారులు తీరిన భక్తులపై పోలీసులు లాఠీ చార్జీ చేశారు. దీనిని కవర్ చేస్తున్న మీడియా పై కూడా బెదిరింపులకు పాల్పడ్డారు.