Peddi First Glimpse: రామ్ చరణ్ మాస్ లుక్.. సిగ్నేచర్ షాట్ అదిరింది..

Peddi First Glimpse: రామ్ చరణ్ మాస్ లుక్.. సిగ్నేచర్ షాట్ అదిరింది..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన మూవీ ఫేమ్ బుచ్చిబాబు సాన కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా "పెద్ది". ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తుండగా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, మీర్జాపూర్ వెబ్ సీరీస్ ఫేమ్ డివైనందు, జగపతి బాబు తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాని బుచ్చిబాబు పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు.

శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం పెద్ది సినిమా రిలీజ్ డేట్, ఫస్ట్ షాట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులోభాగంగా ఆడియన్స్ కి ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.  ఈ సినిమాలో రామ్ చరణ్ క్రికెటర్ పాత్రలో కనిపించాడు. క్రికెటర్ అంటే ఎదో నేషనల్, ఇంటర్నేషనల్ కాదు.. ఊళ్ళో ఉండే మాస్ క్రికెటర్... క్రికెట్ మ్యాచ్ ఆటతో మొదలయ్యే గ్లింప్స్, రామ్ చరణ్ మాస్ లుక్, సిగ్నేచరా షాట్ అంచనాలు పెంచేశాయి. ఇక విజువల్స్ కి తగ్గట్టుగా ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ బీజియం పర్ఫెక్ట్ గా సింక్ చేశాడు. ఓవరాల్ గా చూస్తే రంగస్థలం తర్వాత మరోసారి రామ్ చరణ్ మళ్ళీ తన సోలో పెర్ఫార్మెన్స్ తో బాక్సాఫీస్ ని షేక్ చెయ్యడం ఖాయమని తెలుస్తోంది.
 

అయితే పెద్ది సినిమా ని పాన్ భాషల్లో వచ్చే ఏడాది మార్చ్ 27న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో రామ్ చరణ్ రంగస్థలం కూడా మార్చ్ లోనే రిలీజ్ అయ్యింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో రామ్ చరణ్ మాలీ ఇదే మార్చ్ సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.