Peddi Movie Release Date: శ్రీరామనవమికి చరణ్ ఫ్యాన్స్ కి గ్రాండ్ ట్రీట్ ఇవ్వనున్న బుచ్చిబాబు..

Peddi Movie Release Date: శ్రీరామనవమికి చరణ్ ఫ్యాన్స్ కి గ్రాండ్ ట్రీట్ ఇవ్వనున్న బుచ్చిబాబు..

టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా "పెద్ది". ఈ సినిమాకి ప్రముఖ డైరెక్టర్ బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తుండగా రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ సినీ నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇటీవలే రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చెయ్యగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు అంచనాలు కూడా పెంచింది. అయితే బుచ్చిబాబు చెర్రీ ఫ్యాన్స్ కి మాస్ ఫస్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇందులోభాగంగా ఏప్రిల్ 6న శ్రీరామ నవమి సందర్భంగా ఉదయం 11:45 గంటలకి పెద్ది సినిమా రిలీజ్ డేట్ గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. అలాగే ఈ గ్లింప్స్ ఆడియో మిక్సింగ్ కూడా పూర్తయినట్లు తెలిపాడు. ఈ విషయానికి సంబందించిన పోస్టర్ ని కూడా షేర్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ లో ఆస్కార్ అవార్డు విన్నర్ పెద్ది సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కూడా కనిపించాడు. దీంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే పెద్ది సినిమా హైదరాబాద్ లో రెండో షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. దీంతో త్వరలోనే మూడో షెడ్యూల్ మొదలుకానుంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రామాలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. దీంతో ఈ సినిమాని బుచ్చిబాబు పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.