రూ. వెయ్యి కోట్లతో నర్సంపేట అభివృద్ధి : పెద్ది సుదర్శన్‌‌‌‌‌‌‌‌రెడ్డి

నర్సంపేట, వెలుగు : నర్సంపేట నియోజకవర్గంలో ప్రతిపక్ష నాయకులు చేసిన అభివృద్ధి ఏమీ లేదని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ పెద్ది సుదర్శన్‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. వరంగల్‌‌‌‌‌‌‌‌ జిల్లా చెన్నారావుపేట, దుగ్గొండి మండలాలకు చెందిన కాంగ్రెస్, ఎంసీపీఐ(యూ)కు చెందిన పలువురు గురువారం పెద్ది సమక్షంలో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాకాల వాగుపై 13 చెక్‌‌‌‌‌‌‌‌డ్యాంలను మంజూరు చేశామని, మూడు హైలెవల్‌‌‌‌‌‌‌‌ బ్రిడ్జి పనులు ప్రారంభం అయ్యాయని తెలపారు. తన హయాంలో రూ. వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు చేసినట్లు చెప్పారు. తనను మరోసారి గెలిపిస్తే నర్సంపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. 

ALSO READ :  బీజేపీ వస్తే బీసీ సీఎం : రఘునందన్​రావు