నర్సంపేటలో దివ్యాంగులకు బ్యాటరీ సైకిళ్లు పంపిణీ

నర్సంపేట, వెలుగు : నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని 41 మంది దివ్యాంగులకు శనివారం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌‌రెడ్డి, వికలాంగుల సంస్థ చైర్మన్‌‌ వాసుదేవరెడ్డి బ్యాటరీ సైకిళ్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌‌లో కూడా దివ్యాంగ పింఛన్‌‌ రూ. 1000 మాత్రమే ఇస్తున్నారన్నారు.

తెలంగాణ ఇస్తున్న పింఛన్‌‌ మరే రాష్ట్రంలోనూ ఇవ్వడం లేదన్నారు. దివ్యాంగులకు ఫ్రీగా 42 వేల విలువ గల బ్యాటరీ సైకిళ్లను అందజేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ ఫ్లోర్‌‌ లీడర్‌‌ పెద్ది స్వప్న, సబిత, నూకల కృష్ణమూర్తి, కన్న రాధ పాల్గొన్నారు.