నల్లబెల్లి, వెలుగు : బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి తనకు మరో ఛాన్స్ ఇవ్వాలని బీఆర్‌ఎస్ నర్సంపేట క్యాండిడేడేట్ పెద్ది సుదర్శన్‌రెడ్డి కోరారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌కు ఓటు వేస్తే కష్టాలు కొని తెచ్చుకున్నట్లేనన్నారు. సీఎం కేసీఆర్‌తో కొట్లాడి తెచ్చిన నిధులతో పాకాల, రంగయ్య చెరువు ప్రాజెక్టులను నిర్మించి గోదావరి జలాలతో నర్సంపేటను సస్యశ్యామలం చేశానని గుర్తు చేశారు.
నర్సంపేటకు మెడికల్ కాలేజీ, 350 బెడ్ల జిల్లా హాస్పటల్‌ను మంజూరు చేయించానని చెప్పారు. రూ. 2 వేల కోట్లతో నర్సంపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానన్నారు. కరోనా టైంలో ప్రజల మధ్యే ఉండి ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తాను నిత్యం ప్రజల మధ్యే ఉండి సేవ చేస్తున్నానని, ఓటు అడిగే హక్కు తనకే ఉందన్నారు. అనంతతరం పలు పార్టీలకు చెందిన నాయకులు పెద్ది సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సారంగపాణి, నాయకులు మరళీధర్, శ్రీనివాస్, యువరాజు, రమేశ్, రాజు, ప్రవీణ్, శ్రీదేవి పాల్గొన్నారు.