
#RC16 లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. రాంచరణ్, ‘ఉప్పెన’ సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబోలో వస్తున్న ‘పెద్ది’ సినిమా గ్లింప్స్ వీడియోను శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్ 6న విడుదల చేస్తున్నట్లు ‘పెద్ది’ సినిమా టీం ప్రకటించింది. ‘ఉగాది’ శుభాకాంక్షలు తెలిపిన సందర్భంలో ఈ విషయాన్ని దర్శకుడు బుచ్చిబాబు సన ‘ఎక్స్’ వేదికగా ‘పెద్ది’ సినిమాలోని ఒక పోస్టర్తో ప్రకటించాడు. #PeddiFirstShot పేరుతో ఈ గ్లింప్స్ వీడియోను విడుదల చేయనున్నట్లు బుచ్చిబాబు తెలిపాడు. ‘పెద్ది’ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.
#PeddiFirstShot - Glimpse video out on 6th April on the occasion of Sri Rama Navami ❤️🔥
— BuchiBabuSana (@BuchiBabuSana) March 30, 2025
Wishing you a very Happy Ugadi ✨#Peddi 🔥
Global Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @arrahman @RathnaveluDop @artkolla @NavinNooli @IamJagguBhai @divyenndu @vriddhicinemas… pic.twitter.com/JBsv5ugWgF
‘పెద్ది’ సినిమాలో రాంచరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా, ‘మీర్జాపూర్’ మున్నా భయ్యాగా ఫేమస్ అయిన దివ్యేందు శర్మ కూడా ‘పెద్ది’లో నటిస్తున్నాడు. కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమాకు సినిమాటోగ్రాఫర్ రత్నవేలు కాగా, నవీన్ నూలి ఎడిటర్.
ALSO READ | ఇంట్రెస్టింగ్ నైంటీస్ లవ్‌స్టోరీ బ్యాక్ డ్రాప్ లో ‘మధురం’
మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘పెద్ది’ టైటిల్‌ను అనౌన్స్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో చరణ్ రస్టిక్ లుక్‌లో ఇంటెన్స్‌గా కనిపిస్తున్నాడు. ఒత్తైన జుట్టు, గడ్డంతో చేతిలో క్రికెట్ బ్యాట్ పట్టుకుని ఫెరోషియస్‌గా ఇంప్రెస్ చేస్తున్నాడు. బ్యాక్ డ్రాప్‌లో స్టేడియంలోని ఫ్లడ్ లైట్లు కనిపించడంతో కథ, కథనంపై ఆసక్తిని పెంచేలా పోస్టర్ ఉంది.
Happy Birthday my Dear @AlwaysRamCharan Sir...
— BuchiBabuSana (@BuchiBabuSana) March 27, 2025
In one word you are Gold Sir 🤍🤍🤍🤍
Tqq for everything Sir 🙏🏼🙏🤗🤗🤗 pic.twitter.com/aNc1QLGU8q
ఇక మరో పోస్టర్‌లో ముక్కుకి రింగు, నోట్లో సిగార్‌తో పవర్‌ఫుల్ గెటప్లో కనిపిస్తున్నాడు. ఈ రెండు పోస్టర్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.