ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగిసినా నేతల మధ్య మాటల యుద్దానికి మాత్రం శుభం కార్డు పడలేదు. జూన్ 4న ఫలితాలు వెలువడనుండటంతో ఇరువర్గాల నేతలు గెలుపుపై ధీమాగా ఉన్నారు. ఈ క్రమంలో నారా లోకేష్ పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేసారు. తాము విదేశాలకు పారిపోతున్నామంటూ టీడీపీ శ్రేణులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. లోకేష్ లాంటి మూర్ఖులు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని, పప్పు లోకేష్ అని అందుకే అంటరాని అన్నారు.
ఐదేళ్లు మంత్రిగా పని చేసి కూడా సీటు తెచ్చుకోలేని నువ్వు మాట్లాడతావా అని ఆగ్రహం వ్యక్తం చేసారు పెద్దిరెడ్డి. బీజేపీ నాయకులకు, చంద్రబాబుకు ఓటు హైదరాబాద్ లో ఉందని, ఇక్కడ రాజకీయం చేస్తున్నారని అన్నారు. విద్యార్ధి దశ నుండే స్టూడెంట్ యూనియన్ నాయకుడిగా చంద్రబాబుకు పోటీగా ఉన్నానని అన్నారు. జూన్ 4న ఫలితాల తర్వాత మీ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారో చూడాలని అన్నారు పెద్దిరెడ్డి.