ఆర్మూర్, వెలుగు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబరు 3న నిజామాబాద్ పర్యటనకు వస్తున్నందున కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్దోళ్ల గంగారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం ఆర్మూర్ లో జరిగిన బీజేపీ ముఖ్య లీడర్ల సమావేశానికి ఆయన మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, రాష్ట్రంలో పార్టీ విజయానికి కార్యకర్తలు కృషి చేయాలన్నారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ నర్సింహారెడ్డి, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్, అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు, ఆర్మూర్ అసెంబ్లీ ప్రభారి నందారెడ్డి, కంచెట్టి గంగాధర్, పైడి రాకేశ్ రెడ్డి, ద్యాగ ఉదయ్, పులి యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.